ఒంటిమిట్ట రామాలయం మూసివేత.. రాజగోపురం తలుపులు మూసేసిన పురావస్తుశాఖ

17-04-2021 Sat 09:43
  • పురావస్తుశాఖ పరిధిలోని ఆలయాల మూసివేత
  • ప్రాచీన కట్టడాలు, స్మారక స్థలాల్లో సందర్శనలు నిలిపివేత
  • ఉత్తర్వులు జారీ చేసిన పురావస్తు శాఖ చీఫ్
vontimitta kodandarama swamy temple closed

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయం మూతపడింది. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో తమ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలతోపాటు ప్రాచీన కట్టడాల్లో దర్శనాలు, యాత్రికుల సందర్శనలు నిలిపివేయాలని పురావస్తు శాఖ నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ఎన్‌కే పాఠక్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం కోదండ రామాలయం తూర్పు రాజ గోపురం తలుపులను పురావస్తుశాఖ అధికారులు మూసివేశారు. అలాగే, జిల్లాలోని ప్రముఖ ఆలయాలు, ప్రాచీన కట్టడాలు, స్మారక స్థలాలు, ప్రదర్శన శాలల్లోకి వచ్చే నెల 15 వ తేదీ వరకు ఎవరినీ అనుమతించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.