చండీగఢ్‌లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న యూకే స్ట్రెయిన్.. 70 శాతం కేసుల్లో నిర్ధారణ

17-04-2021 Sat 08:12
  • ఢిల్లీలోని పీజీఐఎంఈఆర్‌లో నమూనాల పరీక్ష
  • 20 శాతం నమూనాల్లో 681 మ్యూటెంట్
  • ఒక నమూనాలో డబుల్ మ్యూటెంట్
 70 percent samples in chandigarh have UK strain virus

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి మళ్లీ కొనసాగుతున్న వేళ.. చండీగఢ్‌లో యూకే రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ నమోదైన కేసుల్లో 60 శాతం నమూనాలను ఢిల్లీలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రానికి పంపించి పరీక్షించగా వాటిలో 70 శాతం శాంపిళ్లలో యూకే స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.

మరో 20 శాతం నమూనాల్లో 681 హెచ్ మ్యూటెంట్ ఉన్నట్టు గుర్తించారు. ఒక్క నమూనాలో మాత్రం డబుల్ మ్యూటెంట్‌ను గుర్తించినట్టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్  (పీజీఐఎంఈఆర్) డైరెక్టర్ జగత్ రామ్ పేర్కొన్నారు. యూకే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.