విడాకుల వరకు తీసుకెళ్లిన బొద్దింకల భయం!

16-04-2021 Fri 22:45
  • 3 ఏళ్లలో 18 ఇళ్లు మారిన జంట
  • భార్య బొద్దింకల భయమే ముఖ్య కారణం
  • మానసిక వైద్యులకు చూపించినా మారని భార్య
  • విసిగి విడాకులకు సిద్ధమైన భర్త
A wifes cocroach Phobia Made couple to Shift 18 houses

బొద్దింకలంటే ఓ భార్యకు ఉన్న భయం మూడేళ్లలో 18 ఇళ్లు మారేలా చేసింది. చివరకు పరిష్కారం లభించిందా అంటే అదీ లేదు. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త చివరకు విడాకులకు సిద్ధమయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకు భార్య వంటగదిలో పెద్దగా కేకలు పెట్టింది. ఏమిటా అని ఆరా తీస్తే.. బొద్దింకలంటే భయమని చెప్పింది. ఇక ఆ గదిలోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. వేరే ఇల్లు మారదామని పట్టుబట్టింది. తప్పక ఇంకో ఇంటికి మారారు. ఈ పరంపర 18 ఇళ్లు మారే వరకు కొనసాగింది.

దీంతో భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త మానసిక వైద్యులకు చూపించాడు. కానీ, వారి సూచనలు, ఔషధాలేవీ ఆ భార్య పట్టించుకోలేదు సరికదా.. తన భర్త తనని పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నాడని ఆరోపించింది. దీంతో విసిగిపోయిన భర్త చేసేది లేక ఇక ఇప్పుడు విడాకులకు సిద్ధమయ్యాడు.