ఏపీలో అమాంతం పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు!

16-04-2021 Fri 19:37
  • గత 24 గంటల్లో 6,096 కరోనా పాజిటివ్ కేసులు
  • రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి
  • రాష్ట్రంలో ప్రస్తుతం 35,592 యాక్టివ్ కేసులు
20 people dead in AP in a single day with Corona

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతున్న తరుణంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో... మహమ్మారి భారీగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 35,962 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 6,096 మందికి పాటిజివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపూర్, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. మరోవైపు 2,194 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య 9,48,231కి పెరిగింది. 9,05,266 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 7,373 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35,592 యాక్టివ్ కేసులు ఉన్నాయి.