అప్పుడు నేను చూసిన పవన్ కల్యాణ్ వేరు: ప్రకాశ్ రాజ్

16-04-2021 Fri 19:25
  • అప్పట్లో పవన్ చాలా సిగ్గరి
  • పవన్ చాలా బోల్డ్ .. చాలా సింపుల్.
  • ప్రజల పట్ల ఆయనకి ప్రేమ ఎక్కువ
  •  పవన్ ఇప్పుడు చాలా ఎదిగిపోయారు  
Prakashraj praises Pawankalyan

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' .. భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమా పవన్ కల్యాణ్ కి ఎంత పేరు తెచ్చిందో, ఆయనకి ఆపోజిట్ రోల్ చేసిన ప్రకాశ్ రాజ్ కి కూడా అంతే పేరు తెచ్చింది.

 తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి .. పవన్ కల్యాణ్ గురించి ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. పవన్ కల్యాణ్ తో నేను 'సుస్వాగతం' .. 'బద్రి' .. 'జల్సా' .. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలు చేశాను. 'వకీల్ సాబ్' మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 5వ సినిమా.

పవన్ కెరియర్ తొలినాళ్లలో 'సుస్వాగతం' వచ్చింది. అప్పుడు నేను చూసిన పవన్ కల్యాణ్ వేరు. అప్పుడు ఆయన చాలా బిడియపడుతూ కనిపించేవారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అప్పటికీ .. ఇప్పటికీ నటన పరంగా .. క్రేజ్ పరంగా .. వ్యక్తిత్వం పరంగా చాలా ఎదిగిపోయారాయన. పవన్ చాలా బోల్డ్ .. చాలా సింపుల్. దేశం పట్ల .. ప్రజల పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. సెట్స్ లో నుంచి జనంలోకి వెళ్లిన ఆయన, ఒక వ్యక్తిగా చాలా దూరం ప్రయాణించారు. ఆయన నటన .. వ్యక్తిత్వం కారణంగానే ఈ రోజున ఇంతమంది ప్రేమిస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.