కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు కరోనా పాజిటివ్‌

16-04-2021 Fri 18:59
  • ట్విట్టర్‌ వేదికగా వెల్లడించిన మంత్రి
  • తనని కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని సూచన
  • గత నెలలోనే టీకా తొలి డోసు తీసుకున్న జవదేకర్‌
Central min prakash Javadekar tests corona positive

కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. గత రెండు, మూడు రోజుల్లో తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత నెలలోనే ఆయన కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. రెండో డోసు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైన తరుణంలో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం.

సామాన్యులతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల వంటి ప్రముఖులు సైతం మహమ్మారి విజృంభణకు ప్రభావితమవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకి సైతం నేడే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన మహమ్మారి బారిన పడడం ఇది రెండోసారి.