నేను బాగున్నాను.. ఆందోళన చెందవద్దు: పవన్ కల్యాణ్

16-04-2021 Fri 18:24
  • పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్
  • ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్న జనసేనాని
  • తన ఆరోగ్యం బాగుందని తెలిపిన పవన్
My health is good says Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న తర్వాత పవన్ హైదరాబాదుకు వచ్చారు. అనంతరం 4వ తేదీన 'వకీల్ సాబ్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా... నెగెటివ్ వచ్చింది. అనంతరం ఆయన తన ఫామ్ హౌస్ లో క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో మళ్లీ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు.

పవన్ కు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ, తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.