'ఆచార్య' అనుకున్న డేట్లో 'లవ్ స్టోరీ'?

16-04-2021 Fri 17:17
  • పెరుగుతున్న కరోనా కేసులు
  • 'ఆచార్య' విడుదల తేదీ వాయిదా
  • 'లవ్ స్టోరీ' టీమ్ ఆలోచన అదే
Love Story is going to release on May 13

కరోనా ప్రభావం కారణంగా కొత్త సినిమాల విడుదల తేదీలు తారుమారు అవుతున్నాయి. కరోనా ఎప్పటికి పూర్తిగా తగ్గుతుందో .. ఏ డేట్ ను విడుదల తేదీగా ప్రకటించాలో తెలియక దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

ఇక ఆల్రెడీ విడుదల తేదీలు చెప్పేసినవాళ్లు, తమ సినిమాలు థియేటర్ల వరకూ వెళ్లేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలియక అయోమయానికి లోనవుతున్నారు. ఎందుకైనా మంచిదని చెప్పేసి విడుదల తేదీలను వాయిదా వేస్తున్నారు. అలా మే 13వ తేదీన రావలసిన 'ఆచార్య' కూడా వాయిదా పడింది.

చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. చిరూ సరసన కాజల్ సందడి చేయనున్న ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనున్నారు. మే 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. అయితే ఇదే రోజున 'లవ్ స్టోరీ' రానున్నట్టుగా తెలుస్తోంది. చైతూ - సాయిపల్లవి జోడిగా శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించాడు. మే 13నాటికి కరోనా ప్ర్రభావం అంతగా ఉండకపోవచ్చనే ఉద్దేశంతో ఈ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.