Prabhas: మరో బాలీవుడ్ ప్రాజెక్టును ఓకే చేసిన ప్రభాస్!

Prabhas said okay to another bollywood project
  • ముగింపు దశలో 'రాధే శ్యామ్'
  • సెట్స్ పై 'సలార్' .. 'ఆది పురుష్'
  • సిద్ధార్థ్ ఆనంద్ కి గ్రీన్ సిగ్నల్
ప్రభాస్ అనేది ఒక పేరు కాదు .. ఒక పవర్ఫుల్ మంత్రం అని అభిమానులు అనుకునేలా ఆయన చేశాడు. ఉత్తరాదిన ఉన్న స్టార్ డైరక్టర్లు .. బడా బ్యానర్లు తన గురించి మాత్రమే ఆలోచించేలా చేశాడు. ప్రభాస్ అనే పేరు అంతటా అలముకునేలా .. అభిమానుల హృదయాలను ఆక్రమించేలా చేశాడు. దాంతో ఇప్పుడు టాలీవుడ్ దర్శకులకు కూడా ప్రభాస్ డేట్లు దొరకడం కష్టమైపోయింది. ఆల్రెడీ పరభాషా దర్శకుల సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్టును ఖాయం చేసుకున్నాడనేది తాజా సమాచారం.


ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్'ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్న 'సలార్' .. 'ఆది పురుష్' రెండూ కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి ఎంతమాత్రం దగ్గర సంబంధం లేనివే. ఒక్కోక్కటి ఒక్కో జోనర్ కి చెందినవే. ఈ నేపథ్యంలోనే.. 'వార్' వంటి భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొంతకాలంగా చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఖాయమైపోయిందట. త్వరలోనే ఇతర వివరాలు తెలియనున్నాయి.
Prabhas
Radhe Shyam
Adipurush
Siddharth Anand

More Telugu News