Dhanush: బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిల్చిన 'కర్ణన్'

  • విభిన్నమైన కథాంశంతో వచ్చిన 'కర్ణన్'
  • విడుదలైన రోజు నుంచి విజయవిహారం
  • తొలి ఐదు రోజుల్లో 40 కోట్లకి పైగా గ్రాస్    
Highest box office collections for Karnan movie

కోలీవుడ్ కథానాయకులలో కొత్తదనం కోసం తపించేవారి జాబితాలో ధనుశ్ ఒకరిగా కనిపిస్తాడు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన కెరియర్ ను పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'కర్ణన్' వచ్చింది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన రెండవ రోజు నుంచే అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లోకి వచ్చింది. అయినా తొలిరోజునే హిట్ టాక్ రావడంతో, థియేటర్లకు జనం పోటెత్తుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోను ఈ సినిమా తొలి 5 రోజుల్లో 40 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించడం విశేషం. 100 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్టయితే ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కర్ణుడు స్నేహం కోసం ప్రాణం ఇచ్చాడు .. ఈ కర్ణుడు తనని నమ్మినవారి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక నిలబడతాడు. పెద్దవాళ్లమనీ .. పెత్తందారులమని చెప్పుకునే వాళ్లను ఆయన ఎదిరించే విధానమే ఇందులో కొత్తగా ఉంటుంది. అదే ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది. ఈ సినిమాలో ధనుశ్ సరసన రజీషా విజయన్ ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News