America: అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం.. రష్యా దౌత్యాధికారులను బహిష్కరించిన అమెరికా!

America Deported 10 Russia Ambassadors
  • పదిమంది దౌత్యాధికారులపై చర్యలు
  • ట్రంప్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు యత్నించినట్టు ఆరోపణ
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ వారికి ఆ అధికారాలు ఇచ్చారంటున్న అమెరికా
గతేడాది అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలపై పదిమంది రష్యా దౌత్యాధికారులపై అమెరికా వేటేసింది. నిన్న వారిని దేశం నుంచి బహిష్కరించింది. అధ్యక్ష ఎన్నికల్లో అనుచితంగా జోక్యం చేసుకోవడంతోపాటు ఫెడరల్ సంస్థ కంప్యూటర్లను హ్యాక్ చేశారన్న కారణంతో ఈ చర్యలు చేపట్టింది.

 డొనాల్డ్ ట్రంప్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ దౌత్యాధికారులకు అధికారాలు ఇచ్చినట్టు అమెరికా అధికారులు గతంలో ఆరోపించగా, తాజాగా వారిని దేశం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
America
Russia
Ambassador
Donald Trump
Presidential Elections

More Telugu News