Hyderabad: హైదరాబాదీల నిద్ర అలవాట్లపై అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాల వెల్లడి

wakefit study reveals hyderabad peoples sleeping habbits
  • 94 శాతం మంది నిద్రపోవడానికి ముందు సెల్‌తో కుస్తీ
  • 80 శాతం మంది వారానికి మూడు రోజులు నిద్రమబ్బుతోనే పని
  • 40 శాతం మందిలో వెన్నునొప్పి
  • వేక్‌ఫిట్.కో అధ్యయనంలో వెల్లడి
హైదరాబాదీల నిద్ర అలవాట్లపై ‘స్లీప్ అండ్ హోం సొల్యూషన్స్’ అనే ఉపకరణాల తయారీ సంస్థ ‘వేక్‌ఫిట్.కో’ నిర్వహించిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. సంస్థ నాలుగో వార్షిక అధ్యయనం ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్-2021 (జీఐఎస్ఎస్)లో హైదరాబాదీల నిద్రకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ వాసుల్లో 94 శాతం మంది రాత్రి నిద్రపోవడానికి ముందు సెల్‌ఫోన్‌తోనే గడిపేస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.

గతేడాదితో పోలిస్తే ఇది మూడు శాతం అధికం కావడం గమనార్హం. 80 శాతం మంది వారానికి ఒకటి నుంచి మూడు రోజులు నిద్రమబ్బుతోనే పనిచేస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. 26 శాతం మంది అర్ధరాత్రి వరకు ఫోన్, ల్యాప్‌టాప్‌తోనే గడిపేస్తున్నట్టు తేలింది. 16 శాతం మంది స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లతో బెడ్‌పైనే పనిచేస్తుండగా, 40 శాతం మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నారని, 90 శాతం కంటే ఎక్కువమంది రాత్రివేళ ఒకటి, రెండుసార్లు మేల్కొంటున్నట్టు ‘వేక్‌ఫిట్.కో’ అధ్యయనంలో తేలింది. అయితే, దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాదీలకు ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లపై అవగాహన ఎక్కువని వెల్లడైంది.
Hyderabad
Sleep
wakefit
study

More Telugu News