Vivek Girreddy: తెలుగు యువకుడు గిర్రెడ్డి వివేక్ కు రూ.  కోటిన్నర వేతనం... అమెజాన్ ఆఫర్!

  • పలు ప్రతిష్ఠాత్మక వర్శిటీల్లో విద్య
  • ఇటీవల ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ఎంపిక
  • హైదరాబాద్ లో స్థిరపడ్డ వివేక్ తల్లిదండ్రులు
G Vivek Gets Job in Amazon for Salary of One and Half Crore

తెలుగు యువకుడు గిర్రెడ్డి వివేక్ కు అమెజాన్ బంపరాఫర్ ఇచ్చింది. ఈ ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలో వివేక్, సాలీనా రూ. 1.50 కోట్ల వేతనంతో ఉద్యోగం పొందాడు. ముంబైలోని డాన్ బాస్కో స్కూల్ లో ఇంటర్ వరకూ చదివి, ఆపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కెనడాలోని మాంట్రియల్ లో ఉన్న మెక్ గిల్ యూనివర్శిటీలో, ఆపై అట్లాంటాలోని జార్జ్ టెక్ వర్శిటీలో ఎంబీఏ విద్యను అభ్యసించిన వివేక్, ఇటీవల అమెజాన్ నిర్వహించిన 'ఫైనాన్షియల్ లీడర్ షిప్ ప్రోగ్రామ్'లో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ఎంపికయ్యాడు.

ఈ ఉద్యోగం చేసేందుకు బేసిక్ శాలరీతో పాటు, ఇతర ప్రోత్సాహకాలు, అలవెన్సులను కలిపితే, అతనికి ఏడాదికి కోటిన్నర రూపాయల వేతనం లభించనుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వివేక్ తల్లిదండ్రులు సూర్యనారాయణ రెడ్డి, భానులు ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. గతంలో సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కు జీఎంగా పని చేసిన సూర్యనారాయణ రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News