Corona Virus: కరోనా ఎఫెక్ట్‌.. చారిత్రక కట్టడాల మూసివేత

  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • ముందు జాగ్రత్తగా పురాతన కట్టడాల సందర్శన నిలిపివేత
  • ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్ణయం
  • కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ వెల్లడి
sites under the ASI have been closed with immediate effect

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే పురాతన, చారిత్రక కట్టడాలు, మ్యూజియాలతో పాటు భారత పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే అన్ని కట్టడాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ‘ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ)’ నిర్ణయం తీసుకోగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

గత ఏడాది సైతం ఇదే తరహాలో అన్ని రకాల కట్టడాలను మూసివేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.

More Telugu News