రాళ్ల దాడి ఘటనపై కేసు నమోదైంది... టీడీపీ ఎంపీ గల్లాకు ప్రత్యుత్తరం పంపిన సీఈసీ

15-04-2021 Thu 21:06
  • తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
  • ప్రచారం సందర్భంగా చంద్రబాబుపై రాళ్ల దాడి
  • సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు
  • 12 అంశాల్లో ఎంపీ గల్లాకు బదులిచ్చిన సీఈసీ కార్యదర్శి
  • వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించినట్టు వెల్లడి
CEC replies TDP MP Galla Jaydev on stone pelting issue

తిరుపతిలో చంద్రబాబు ప్రచార సభపై రాళ్ల దాడి జరగడం పట్ల టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్ కుమార్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు 12 అంశాల్లో ప్రత్యుత్తరం ఇచ్చారు.

రాళ్ల దాడిపై కేసు నమోదైందని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక పోలీసు పరిశీలకుడిగా ఐపీఎస్ అధికారిని నియమించామని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించినట్టు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేసినట్టు వివరించారు.