Uddhav Thackeray: కరోనాను ప్రకృతి వైపరీత్యంగా భావించండి.. ఆర్థికసాయం చేయండి: మోదీకి థాకరే లేఖ

  • కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది
  • ఎస్టీఆర్ఎఫ్ తొలి ఇన్స్టాల్ మెంట్ నిధులను విడుదల చేయండి
  • స్టార్ట్ అప్ ల ఈఎంఐలకు వడ్డీ లేకుండా చూడండి
Uddhav Thackeray writes letter mo Modi seeking financial help

కరోనా దెబ్బకు మహారాష్ట్ర తల్లడిల్లుతోంది. అమాంతం పెరిగిపోతున్న కేసులతో మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే లేఖ రాశారు. కరోనా మహమ్మారిని ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలని లేఖలో కోరారు. వైపరీత్యంగా ప్రకటిస్తే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి కరోనా బాధితుల కోసం నిధులను వాడుకోవచ్చని తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందని... ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్డీఆర్ఎఫ్ తొలి ఇన్స్టాల్ మెంట్ నిధులను విడుదల చేయాలని విన్నవించారు. కరోనా నేపథ్యంలో జీఎస్టీ రిటర్నులు చేయడానికి మూడు నెలల వెసులుబాటును కల్పించాలని కోరారు. మార్చి, ఏప్రిల్ నెలల జీఎస్టీ రిటర్నుల గడువును మరో మూడు నెలలు పెంచాలని చెప్పారు.

ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీలు వసూలు చేయకుండా చూడాలని థాకరే కోరారు. ఎన్నో కంపెనీలు, స్టార్ట్ అప్ లు ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాల కింద బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నాయని... వివిధ సెక్టార్ల ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కు తమ వంతు కృషి చేశాయని... వాటికి అపన్నహస్తం అందించాలని కోరారు.

More Telugu News