చివరి గంటలో కొనుగోళ్లు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

15-04-2021 Thu 15:58
  • ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు
  • 259 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 77 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Sensex ends in profits after last hour buying

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల మేర హెచ్చుతగ్గులను ఎదుర్కొంది. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు లాభపడి 48,804కి చేరుకుంది. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకుని 14,581 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (3.67%), ఓఎన్జీసీ (2.89%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.69%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.13%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.29%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.65%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.54%), మారుతి సుజుకి (-2.44%), నెస్లే ఇండియా (-1.69%), బజాజ్ ఫైనాన్స్ (-1.64%).