తెలంగాణలో మినీ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ విడుదల

15-04-2021 Thu 13:18
  • రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు
  • రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ
  • 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
Notification released for Telangana Municipal elections

తెలంగాణ మరో ఎన్నికలకు సిద్ధమైంది. మినీ పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు... జడ్చర్ల, అచ్చంపేట, సిద్ధిపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.