వైసీపీలో ఒట్టేసి ఒకమాట, ఒట్టేయకుండా ఒకమాట చెప్పే సంస్కృతి లేదు: విజ‌యసాయిరెడ్డి

15-04-2021 Thu 13:13
  • ఓట్ల కోసం చిల్లర డ్రామాలు ఆపు చిట్టి
  • నీ పచ్చ మీడియా వర్తమానాలకు పడిపోయేవారు లేరిక్కడ‌
  • జగన్ గారికి సవాళ్లు విసిరే స్థాయా నీది చిట్టినాయుడూ!
  • నీ జాతకమేంటో మీ పార్టీ నేతలే విప్పుతున్నారు
vijay sai reddy slams tdp

వైఎస్‌ వివేకా హత్యతో త‌న‌కు సంబంధం లేదని తిరుప‌తిలో శ్రీ‌వారి సాక్షిగా ప్రమాణం చేయ‌డానికి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రావాల‌ని టీడీపీ నేత నారా లోకేశ్ స‌వాలు విసిరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లోకేశ్ నిన్న అలిపిరికి వెళ్లి జ‌గ‌న్ కోసం ఎదు‌రు చూశారు. జ‌గ‌న్ అక్క‌డ‌కు రాక‌పోవ‌డంతో  ఆయ‌న త‌ప్పును ఒప్పుకున్న‌ట్లే అని విమ‌ర్శించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ లోకేశ్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ఇక్కడకు వచ్చి ప్రమాణం చెయ్యి. గంటలో రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే-పప్పు నాయుడు ఉవాచ. ఓట్ల కోసం చిల్లర డ్రామాలు ఆపు చిట్టి. నీ పచ్చ మీడియా వర్తమానాలకు పడిపోయేవారు లేరిక్కడ. వైసీపీలో ఒట్టేసి ఒకమాట, ఒట్టేయకుండా ఒకమాట చెప్పే సంస్కృతి లేదు. విశ్వసనీయతే పెట్టుబడి ఇక్కడ' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

'జగన్ గారికి సవాళ్లు విసిరే స్థాయా నీది చిట్టినాయుడూ! నీ జాతకమేంటో మీ పార్టీ నేతలే విప్పుతున్నారు. నీ పార్టీ ఏపీ అధ్యక్షుడే - "ఆయనే ఉంటే" అన్నట్లు మాట్లాడుతున్నాడు. నీవు తిరుపతిలో ఉంటే ఏంటి? తింటూ ఉంటే ఏంటి? డ్యామేజీ కంట్రోల్ కోసం వెళ్లి డ్రామాలేసుకో' అని విజ‌యసాయిరెడ్డి వ్యంగ్యంగా అన్నారు.