'దృశ్యం 2'ను పూర్తిచేసిన వెంకీ!

15-04-2021 Thu 12:05
  • ఘన విజయాన్ని అందుకున్న 'దృశ్యం'
  • ముగింపు దశలో సీక్వెల్ షూటింగ్
  • హైలైట్ గా నిలవనున్న అనూప్ సంగీతం  
Venkatesh Completed his portion of the shoot for Drishyam Sequel

మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన 'దృశ్యం' .. తెలుగులో అదే టైటిల్ తో రూపొంది భారీ విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ కెరియర్ లోనే ఇది ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఇక మలయాళంలో ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'దృశ్యం 2' కూడా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మూలకథను హ్యాండిల్ చేసిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే తెలుగు రీమేక్ చేస్తున్నారు. 'దృశ్యం 2' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో, మొదటి భాగంలో చేసిన ఆర్టిస్టులంతా కనిపించనున్నారు.

తెలుగు 'దృశ్యం 2' సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతూ వెళుతోంది. 'నారప్ప' తరువాత వెంకటేశ్ పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. తాజాగా ఆయన పోర్షన్ కి సంబంధించిన షూటింగు పూర్తయింది. ఇక వెంకటేశ్ 'ఎఫ్ 3' కోసం పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు. 'దృశ్యం 2'లో హీరో నేరం చేశాడని నిరూపించడం కోసం పోలీసులు ఒక ప్లాన్ వేస్తారు. ఆ ట్విస్ట్ కి షాక్ కాని ఆడియన్స్ బహుశా ఉండకపోవచ్చు. అందుకు జీతూ జోసెఫ్ ను మెచ్చుకోని వాళ్లుండరు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది.