జగన్ క్షమాపణలు చెప్పాలి: తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ

15-04-2021 Thu 11:51
  • అంబేద్కర్ గురించి వేసిన కార్టూన్ స‌రికాదు
  • ఈ చ‌ర్యను పూర్తిగా ఖండిస్తున్నాను
  • ఇది దేశ ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన అవ‌మానం
Jagan should apologize to the nation

దేశ ప్ర‌జ‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ తిరుప‌తి ఉప ఎన్నిక బీజేపీ-జ‌న‌సేన అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ ఓ ట్వీట్ చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్  గురించి సాక్షి దిన‌ప‌త్రిక‌లో వేసిన ఓ కార్టూన్ ప‌ట్ల ఆమె అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. ఈ చ‌ర్యను పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు చెప్పారు. ఇది దేశ ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన అవ‌మానంగా ఆమె పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీతో పాటు, బీజేపీ నేత సునీల్ డియోధ‌ర్, జ‌న‌సేన పార్టీ, బీజేపీ ట్విట్ట‌ర్ ఖాతాల‌ను ఆమె ట్యాగ్ చేశారు.