'ఇష్క్' మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

15-04-2021 Thu 11:35
  • తేజ సజ్జా జోడీగా ప్రియా ప్రకాశ్
  • దర్శకుడిగా రాజు పరిచయం
  • ఈ నెల 23వ తేదీన విడుదల  
Ishq Movie Trailer Released

ఈ మధ్య కాలంలో విభిన్నమైన కాన్సెప్టులు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే తప్ప, ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం లేదు. దాంతో టైటిల్ దగ్గర నుంచే కొత్తదనం చూపించడానికి దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా రూపొందిన చిత్రమే 'ఇష్క్' .. నాట్ ఎ లవ్ స్టోరీ. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా ప్రియా ప్రకాశ్ వరియర్ ఆకట్టుకోనుంది. పోస్టర్స్ పై ప్రేమికులను చూపిస్తూ, ఇది లవ్ స్టోరీ కాదని చెప్పడం యూత్ లో ఆసక్తిని పెంచుతోంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ప్రేమికుల ముద్దు ముచ్చట్లతో మొదలైన ట్రైలర్, ఒక్కసారిగా అక్కడి నుంచి టర్న్ తీసుకుంది. అక్కడి నుంచి వాళ్ల జీవితంలో చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాలకి సంబంధించిన షాట్స్ ను చూపించారు. మొత్తానికి ఈ ఇద్దరి ప్రేమికులను ఏదో శక్తి వెంటాడుతోంది .. వేటాడుతోంది అనే విషయం మాత్రం అర్థమవుతోంది. అదేమిటనేదే సస్పెన్స్ అన్నమాట. మరి ఈ కోవిడ్ పరిస్థితుల్లో ధైర్యం చేసి ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.