హైద‌రాబాద్‌లో వైఎస్‌ షర్మిల దీక్ష ప్రారంభం

15-04-2021 Thu 11:33
  • ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద దీక్ష
  • తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి డిమాండ్
  • 72 గంటల పాటు దీక్ష‌?
Sharmila take part in strike

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ దీక్షను 72 గంటల పాటు నిర్వహించాలని భావించ‌గా, ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో ఆమె ఎప్ప‌టివ‌ర‌కు దీక్ష చేస్తార‌న్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం విదిత‌మే.