30 రోజులు మాత్రమే డేట్లు .. 8 కోట్ల పారితోషికం?

15-04-2021 Thu 11:10
  • 'క్రాక్'తో హిట్ కొట్టిన రవితేజ
  • సెట్స్ పై సందడి చేస్తున్న 'ఖిలాడి'
  • రంగంలోకి కొత్త దర్శకుడు      
Raviteja takes huge Remuneration

సీనియర్ స్టార్ హీరోలలో రవితేజ దూకుడు మామూలుగా లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్'తో తిరుగులేని హిట్ ను తన సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో తన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టాడు. ప్ర్రస్తుతం 'ఖిలాడి' సినిమా షూటింగుతో బిజీగా ఉన్న ఆయన, ఆ తరువాత ప్రాజెక్టును త్రినాథరావు నక్కినతో చేయవలసి ఉంది. కానీ హఠాత్తుగా ఆయన మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువచ్చాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా. శరత్ మండవ కథ వినిపించిన వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అందుకు కారణం కథ .. కథనం ఉత్కంఠను రెకెత్తించే విధంగా ఉండటమే. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది . తనకి గల కమిట్మెంట్స్ గురించి ముందుగానే చెప్పిన రవితేజ, తన పోర్షన్ ను 30 రోజుల్లో పూర్తి చేయాలనే ఓ కండిషన్ పెట్టాడట. 30 రోజులు మాత్రమే డేట్లు ఇచ్చిన ఆయన, అందుకుగాను అందుకునే పారితోషికం 8 కోట్లు అని  చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది.