'ఆచార్య' సినిమాలో హైలైట్ గా చరణ్ రెయిన్ ఫైట్!

15-04-2021 Thu 10:33
  • 'ఆచార్య'లో భారీ యాక్షన్ సీన్లు
  • కొత్తగా డిజైన్ చేయించిన కొరటాల
  • రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ  
Intresting Rain Fight in Acharya

చిరంజీవి .. కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 'సిద్ధ' అనే పవర్ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ప్రస్తుతం ఆయనపై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట. ముఖ్యంగా ఆయనపై డిజైన్ చేసిన 'రెయిన్' ఫైట్, వీలైనన్ని విజిల్స్ ను కలెక్ట్ చేసేలా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇంతవరకూ తెరపై చూసిన రెయిన్ ఫైట్ల కంటే కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా ఈ యాక్షన్ సీన్ ఉంటుందని చెబుతున్నారు.

కొరటాల గత చిత్ర్రాలైన 'మిర్చి' .. 'శ్రీమంతుడు'.. 'జనతా గ్యారేజ్' వంటి సినిమాలు చూస్తే, యాక్షన్ సీన్స్ ను ఆయన ఎంత కొత్తగా తెరపై ఆవిష్కరిస్తాడనేది అర్థమవుతుంది. చాలా నీట్ గా .. పెర్ఫెక్ట్ గా ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అలాగే చరణ్ పై ప్లాన్ చేసిన ఫైట్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

ఇక చిరంజీవి - రెజీనా బృందంపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ .. చరణ్ - పూజా హెగ్డే పై షూట్ చేసిన మెలోడీ సాంగ్ మెగా అభిమానులను హుషారెత్తిస్తాయని చెబుతున్నారు. ఇప్పటి వరకూ హిట్ మాటే వింటూ వచ్చిన కొరటాల, 'ఆచార్య'తో మరో హిట్ ను తన ఖాతాలో జమ చేసుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.