Pakistan: పాక్‌లో చెలరేగిన హింస.. టీఎల్‌పీ పార్టీపై నిషేధం

  • టీఎల్‌పీ చీఫ్ సాద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేయడంతో నిరసనలు
  • ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు సహా ఏడుగురి మృతి
  • 12 మంది కార్యకర్తలు మరణించారంటున్న టీఎల్‌పీ
Pakistan govt decides to ban radical Islamist party Tehreek i Labaik Pakistan

తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్ట్ చేయడంతో పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం అరెస్ట్ చేయడంతో చెలరేగిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ మద్దతుదారులు నిన్న ఆ దేశంలోని పంజాబ్‌లో ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా రేకెత్తిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు సహా ఏడుగురు మృతి చెందారు. 300 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు కూడా 12 మంది ప్రాణాలు కోల్పోయారని టీఎల్‌పీ చెబుతోంది. ఘర్షణలు, హింస నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చట్టం-1997 కింద టీఎల్‌పీపై నిషేధం విధిస్తున్నట్టు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. ఈ పార్టీని నిషేధించాలంటూ పంజాబ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఆమోదం లభించినట్టు చెప్పారు.

మహ్మద్ ప్రవక్తపై కార్టూన్లు ప్రచురించినందుకు గాను ఫ్రెంచ్ రాయబారిని ఈ నెల 20లోగా దేశం నుంచి బహిష్కరించాలంటూ ఇమ్రాన్ ప్రభుత్వానికి టీఎల్‌పీ చీఫ్ రిజ్వీ గడువు విధించారు. ఈ నేపథ్యంలేనే ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్‌తో దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి.

More Telugu News