Kurnool District: కైరుప్పలలో పిడకల సమరం.. రెండు వర్గాలుగా విడిపోయి పిడకలు విసురుకున్న ప్రజలు

  • కర్నూలు జిల్లా కైరుప్పలలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
  • పిడకల సమరంలో 22 మందికి గాయాలు
  • కర్నూలు చౌడేశ్వరీ ఆలయం చుట్టూ గాడిదలతో ప్రదక్షిణ
Pidakala Samaram In Kurnool Dist Kairuppla

కర్నూలు జిల్లా కైరుప్పలలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాది మరుసటి రోజైన నిన్న ఏళ్లుగా వస్తున్న పిడకల సమరాన్ని (పెద్ద నుగ్గులాట) గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో దాడిచేసుకున్నారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా, పిడకల సమరంలో 22 మంది స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు, ఉగాది ఉత్సవాల్లో బాగంగా నిన్న కర్నూలులోని కల్లూరు చౌడేశ్వరీ దేవి ఆలయం చుట్టూ గాడిదలు, ఎడ్ల బండ్లతో ప్రదక్షిణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాదిమంది భక్తులు తరలివచ్చారు.

More Telugu News