East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

Road Accident In East Godavari dist 25 Passengers hurt
  • ఈ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఘటన
  • కంటెయినర్‌ను ఢీకొట్టిన లారీ
  • లారీని తప్పించే ప్రమాదంలో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు
తూర్పుగోదావరి జిల్లాలో ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది స్వల్పంగా గాయపడ్డారు. రాజానగరం మండలం దివాన్ చెరువు సమీపంలో ఓ కంటెయినర్‌ను లారీ ఢీకొట్టింది. అదే సమయంలో విశాఖట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

మరోవైపు, కంటెయినర్‌ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ను అతి కష్టం మీద వెలికి తీశారు. గాయపడిన ప్రయాణకులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
East Godavari District
Road Accident
Visakhapatnam
Vijayawada
Rajamhendravaram

More Telugu News