దేశీయ విమాన ప్రయాణాలపై బెంగాల్ నూతన మార్గదర్శకాల జారీ

15-04-2021 Thu 07:41
  • రాష్ట్రంలోకి వచ్చే వారికి నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
  • బోర్డింగ్‌కు 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి
  • బెంగాల్‌ నుంచి వెళ్లే వారికీ ఇదే నియమం
west bengal released new guidelines for domestic passengers

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ముకుతాడు వేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. వైరస్ ఎక్కువగా వ్యాప్తిలో వున్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు విధిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. బోర్డింగ్‌కు ముందు చేయించుకున్న నెగటివ్ రిపోర్టు ఉంటేనే విమాన ప్రయాణానికి అనుమతి ఇస్తామని తెలిపింది. అంతేకాదు, బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని వివరించింది.