సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

15-04-2021 Thu 07:26
  • 'డ్రైవర్ జమున'గా ఐశ్వర్య రాజేశ్
  • హైదరాబాదులో మహేశ్ షూటింగ్
  • ముగింపు దశకు చేరిన 'ఖిలాడి'  
Aishvarya Rajesh as Driver Jamuna

*  తెలుగు, తమిళ భాషల్లో బిజీ కథానాయికగా రాణిస్తున్న ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు 'డ్రైవర్ జమున' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. కిన్స్ లిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మధ్య తరగతికి చెందిన ఓ యువతి టాక్సీ డ్రైవర్ గా జీవితాన్ని సాగించే పాత్రలో ఐశ్వర్య నటిస్తోంది.
*  మహేశ్ బాబు, పరశురామ్ కలయికలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. మహేశ్, కీర్తి సురేశ్ కూడా ఈ షెడ్యూలులో పాల్గొంటున్నారు.
*  రవితేజ హీరోగా రమేశ్ వర్మ రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. దీంతో మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిర్వహిస్తున్నారు. సీనియర్ నటుడు అర్జున్, యాంకర్ అనసూయ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.