వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా.. ఐసీయూలో చికిత్స‌

15-04-2021 Thu 06:57
  • కరోనా సోకడం వాస్తవమేనన్న ఎమ్మెల్యే కార్యాలయం
  • ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ
  • ఆందోళన అవసరం లేదన్న కార్యాలయం
Tadikonda MLA Vundavalli Sridevi Tested Positive for Corona

గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, శ్రీదేవి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కార్యాలయం పేర్కొంది.

ఆమెకు కరోనా సోకిన మాట నిజమేనని, అయితే, ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని తెలిపింది. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది.