Pushpasreevani Pamula: కొంతమంది వాలంటీర్లు జగన్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

Few volunteers are working against to YSRCP says Pushpasreevani
  • 10 శాతం మంది వ్యతిరేకంగా పని చేస్తున్నారు
  • ఒక వాలంటీర్ భర్త వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేశారు
  • జగన్ వల్లే వాలంటీర్లకు గుర్తింపు వచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి
వాలంటీర్ల వ్యవస్థను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విధులను సక్రమంగా నిర్వహించిన వాలంటీర్లకు సత్కారాలను కూడా చేస్తోంది. అయితే వాలంటీర్లకు సత్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పుష్ఫ శ్రీవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

90 శాతం మంది వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని, మిగిలిన 10 శాతం మంది వ్యతిరేకంగా పని చేస్తున్నారని శ్రీవాణి మండిపడ్డారు. కురుపాం మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారని దుయ్యబట్టారు. జగన్ వల్లే వాలంటీర్లకు గుర్తింపు లభించిందనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
Pushpasreevani Pamula
Jagan
YSRCP
Volunteers

More Telugu News