ఏపీలో ఒక్క రోజులోనే 4 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. 18 మంది మృతి!

14-04-2021 Wed 18:00
  • గత 24 గంటల్లో 4,157 కొత్త కేసులు
  • తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 28,383
AP registers 4157 new Corona cases in 24 hours

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 35,732 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 4,157 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో అత్యల్పంగా 60 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18 మంది కరోనా వల్ల మృతి చెందారు. అలాగే, 1,606 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 9,37,049కి పెరిగింది. మరణాల సంఖ్య 7,339కి చేరుకుంది. ఇప్పటి వరకు 9,01,327 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి.