కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడి

14-04-2021 Wed 16:47
  • ఆదోని మండలం కపటిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • పంచాయతీ బోరును వైసీపీ నేతలు సొంతం చేసుకోవడంపై టీడీపీ శ్రేణుల అభ్యంతరం
  • దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
YSRCP leaders attacks TDP workers in Adoni

ఏపీలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రతిరోజు ఏదో ఒక చోట రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు.

ఘర్షణకు దారి తీసిన ఘటనలోకి వెళ్తే... పంచాయతీ బోరును వైసీపీ నేతలు సొంతం చేసుకున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం శృతి మించింది. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. దాడి నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.