విపక్షాల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు: బొత్స సత్య నారాయణ

14-04-2021 Wed 16:04
  • తిరుపతిలో వైసీపీ విజయం ఖాయం
  • జగన్ సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కడతారు
  • విపక్షాలు గిమ్మిక్కులకు పాల్పడుతున్నాయి
People will not listen to opposition parties says Botsa Satyanarayana

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గెలుపు కోసం విపక్షాలు గిమ్మిక్కులకు పాల్పడుతున్నాయని... వారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకటగిరి శాసనసభ నియోజకవర్గంలో గురుమూర్తి తరపున ఈరోజు వైసీపీ ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో బొత్స సత్యనారాయణతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.