దైవ సాక్షిగా ప్రమాణం చేసేందుకు జగన్ ఎందుకు భయపడుతున్నారు?: నారా లోకేశ్

14-04-2021 Wed 14:27
  • తిరుపతి అలిపిరి వద్దకు చేరుకున్న లోకేశ్   
  • వివేకా హత్యతో మాకు సంబంధం లేదని ప్రమాణం చేశాను
  • తన ఛాలెంజ్ కు పులివెందుల పిల్లి పారిపోయిందన్న లోకేశ్ 
Jagan ran away from my challenge says Nara Lokesh

ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేశ్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైయస్ వివేకా హత్యలో తనకు, తన కుటుంబానికి ఎలాంటి పాత్ర లేదని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశానని... నీకు, నీ కుటుంబానికి సంబంధం లేదని వెంకన్నపై ప్రమాణం చేయాలని తాను విసిరిన ఛాలెంజ్ కు భయపడి పులివెందుల పిల్లి పారిపోయిందని ఎద్దేవా చేశారు.

ఈరోజుతో మర్డర్ మిస్టరీ వీడిపోయిందని చెప్పారు. బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అని అన్నారు. వైయస్ వివేకా హత్య కేసులో తమకు సంబంధం లేదని తిరుపతిలోని అలిపిరిలో వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.

నారా లోకేశ్ ఈరోజు తిరుపతి అలిపిరి వద్దకు చేరుకుని అక్కడున్న గరుడ సర్కిల్ వద్ద ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కత్తితో బతికే వాడు కత్తికే చస్తాడని అన్నారు. జగన్ రెడ్డి ఇక్కడకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసేందుకు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. జగన్ తన నివాసం నుంచి 45 నిమిషాల్లో ఇక్కడకు రావచ్చని చెప్పారు.