కొంప‌లో పిల్లిలా న‌క్కి దాక్కున్నావేం జ‌గ‌న్‌రెడ్డి?: అచ్చెన్నాయుడు

14-04-2021 Wed 12:12
  • లోకేశ్‌ తిరుప‌తిలో ప్ర‌మాణం చేశాడు
  • లోకేశ్‌ స‌వాల్ విసిరితే జ‌గ‌న్ పారిపోయాడు
  • హ‌త్య త‌మ‌ ప‌నేన‌ని ఒప్పుకున్నాడు
atchannaidu slams jagan

వైఎస్‌ వివేకా హత్యతో త‌న‌కు సంబంధం లేదని తిరుప‌తిలో శ్రీ‌వారి సాక్షిగా ప్రమాణం చేయ‌డానికి రావాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌కు టీడీపీ నేత నారా లోకేశ్‌ సవాలు విసిరిన‌ విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు అలిపిరికి చేరుకున్న నారా లోకేశ్ అక్క‌డే కూర్చొని జ‌గ‌న్ కోసం ఎదురు చూస్తున్నారు. జ‌గ‌న్ అక్క‌డికి రాక‌పోవ‌డంతో టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  

'బాబాయ్ హ‌త్య‌తో త‌న‌కుగానీ, త‌న కుటుంబానికి గానీ సంబంధంలేద‌ని నారా లోకేశ్‌ తిరుప‌తిలో ప్ర‌మాణం చేశాడు. మీకుగానీ, మీ కుటుంబ స‌భ్యుల‌కు గానీ ఈ హ‌త్య‌తో సంబంధంలేద‌ని ప్ర‌మాణం చేయ‌కుండా తాడేప‌ల్లి కొంప‌లో పిల్లిలా న‌క్కి దాక్కున్నావేం జ‌గ‌న్‌రెడ్డి?' అంటూ టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు.
 
'తండ్రి శ‌వం ప‌క్క‌నే సీఎం ప‌ద‌వికోసం సంత‌కాలు సేక‌రించావు. బాబాయ్ బాత్రూమ్‌లో ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి వుంటే, ఓట్లు దండుకోవ‌డానికి చూశావు. లోకేశ్‌ స‌వాల్ విసిరితే పారిపోయి, హ‌త్య మీ ప‌నేన‌ని ఒప్పుకున్నావు' అని అచ్చెన్నాయుడు ట్వీట్లు చేశారు.