ప్రభాస్ సూచనపై 'రాధేశ్యామ్' కోసం కొన్ని సీన్ల రీషూట్?

14-04-2021 Wed 11:51
  • ప్రభాస్ పాన్ ఇండియా మూవీగా 'రాధేశ్యామ్'
  • రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే కథ
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి  
Prabhas is going to reshoot few scenes in Radhe shyam

ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు 'రాధేశ్యామ్' కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఒక అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన భారీ సెట్లలోనే చాలావరకూ షూటింగ్ కొనసాగింది. ప్రభాస్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ పెయిర్ ను తెరపై చూడటానికే అభిమానులంతా కుతూహలపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రీ షూట్ కి సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రభాస్ ఈ సినిమా రషెస్ చూసి, కొన్ని సీన్స్ మరింత బాగా చేయాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. ఆ సీన్స్ వరకూ రీ షూట్ చేస్తేనే బాగుంటుందేమోనని అన్నాడట. దాంతో ప్రస్తుతం షూట్ చేస్తున్న సాంగ్ పూర్తయిన తరువాత, రీ షూట్ పెట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చారట.

ఇక ఈ నెల చివరి నాటికి రీ షూట్ కూడా పూర్తవుతుందని అంటున్నారు. జస్టిన్ ప్రభాకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. జూలై 30వ తేదిన ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఇంకా ఈ విషయంలో స్పష్టత రావలసి ఉంది.