అభిమానులందరూ క్షమించండి: షారూక్ ఖాన్

14-04-2021 Wed 11:25
  • ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ ఓటమి
  • నిరాశ చెందిన అభిమానులు
  • ట్విట్టర్ లో క్షమాపణలు చెప్పిన షారూక్
Sharook Khan Says Sorry to KKR Fans

నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గెలుపు ముంగిట ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయంపై కోల్ కతా ఫ్రాంచైజీ యజమాని షారూక్ ఖాన్ స్పందించారు. గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోవడంతో అభిమానులంతా నిరాశతో సోషల్ మీడియాలో స్పందిస్తుండగా, షారూక్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా ఓ కామెంట్ పెట్టారు.

"నిరాశాజనకమైన ఆటతీరు. అందరు అభిమానులను జట్టు తరఫున క్షమాపణలు కోరుతున్నా" అని ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ ని 15వ ఓవర్ వరకూ నియంత్రణలో ఉంచుకున్న కేకేఆర్ జట్టు, ఆపై జస్ ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ ల విజృంభణతో కకావికలై, చాలినన్ని పరుగులు సాధించలేకపోయింది. ఈ మ్యాచ్ లో చివరి 6 బంతులకు 15 పరుగులు కావాల్సిన స్థితిలో, 10 పరుగుల దూరంలో కేకేఆర్ ఆగిపోయింది.