బాబాయిని చంపింది ఎవ‌రో ఈ రోజు తేలిపోతుంది.. నేను రెడీ!: లోకేశ్ సవాల్

14-04-2021 Wed 11:15
  • నేను రెడీ.. నువ్వెక్కడ?
  • తిరుపతికి వచ్చి వెంకన్న సాక్షిగా ప్ర‌మాణం చేయి
  • వివేకా గారి హత్యతో సంబంధం లేదని చెప్పు
lokesh challenges jagan

వైఎస్‌ వివేకా హత్యతో త‌న‌కు, తన కుటుంబానికి సంబంధం లేదని తిరుప‌తిలో శ్రీ‌వారి సాక్షిగా ప్రమాణం చేయ‌డానికి ఏపీ ముఖ్య‌మంత్రి సిద్ధమా? అని టీడీపీ నేత నారా లోకేశ్‌ సవాలు విసిరిన‌ విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 14న వ‌చ్చి ప్ర‌మాణం చేయాల‌ని ఇటీవ‌ల లోకేశ్ చెప్పారు. నేడు ఏప్రిల్ 14 కావ‌డంతో దీనిపై లోకేశ్ స్పందిస్తూ మ‌రోసారి జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

'వైఎస్ జ‌గ‌న్.. బాబాయిని చంపింది ఎవ‌రో ఈ రోజు తేలిపోతుంది. నేను రెడీ.. నువ్వెక్కడ? తిరుపతి వచ్చి వెంకన్న సాక్షిగా వివేకా గారి హత్యతో నీకు, నీ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చెయ్యి. రాకపోతే వివేకా గారిని వేసేసింది అబ్బాయే అనే విషయం ప్రపంచానికి అర్థ‌మవుతుంది' అని లోకేశ్ ట్వీట్ చేశారు.