యాక్షన్ సీన్స్ లో విజృంభిస్తున్న మెగా హీరో!

14-04-2021 Wed 11:00
  • వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'గని'
  • హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ పరిచయం
  • జూలై 30వ తేదీన విడుదల  
Varun Tej is busy with shooting action scenes

'గద్దలకొండ గణేశ్' సినిమాతో హిట్ కొట్టిన వరుణ్ తేజ్, తదుపరి సినిమాగా 'గని' చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన షూటింగుకి ముందే విదేశాలకి వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని వచ్చాడు. ఆ మధ్య లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగు, మళ్లీ వేగాన్ని పుంజుకుంది.

ప్రస్తుతం బాక్సింగ్ కి సంబంధించిన సన్నివేశాలను, దర్శకుడు కిరణ్ కొర్రపాటి తనదైన స్టయిల్లో చిత్రీకరిస్తున్నాడు. ఈ యాక్షన్ సీన్స్ లో ఉపేంద్ర - సునీల్ శెట్టి కూడా పాల్గొంటున్నారని అంటున్నారు. వాళ్లు కూడా ఈ సినిమాలో బాక్సర్లు గానే కనిపిస్తారట.

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న కిరణ్ కొర్రపాటి, కథానాయికగా తెలుగు తెరకి సయీ మంజ్రేకర్ ను పరిచయం చేస్తున్నాడు. అల్లు బాబి - సిద్ధు ముద్ద కలిసి 35 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక జగపతిబాబు పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. నదియా పాత్ర ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాను, జూలై 30వ తేదీన విడుదల చేయనున్నారు.