'అఖండ' టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్!  

14-04-2021 Wed 10:24
  • బోయపాటితో బాలయ్య మూడో సినిమా
  • యాక్షన్ దృశ్యాల్లో చెలరేగిపోయిన బాలయ్య
  • రాకెట్ లా దూసుకుపోతున్న టీజర్        
Balakrishna Akhanda movie teaser got super responce

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అనగానే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇక బోయపాటి మార్క్ యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ బాగా సెట్ అవుతారు. ఆయనకి గల మాస్ ఇమేజ్ కి బోయపాటి కథలు మరింత బాగా సెట్ అవుతాయి. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రావడం కూడా అందుకు కారణం. తాజాగా ఈ ఇద్దరి కలయికలో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, మే 28వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

'ఉగాది' పండగ సందర్భంగా నిన్న ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. సాక్షాత్తు పరమశివుడు కొలువైన ప్రదేశంలో దుష్ట శిక్షణ చేసే అపర కాలభైరవుడిగా ఈ టీజర్ లో బాలకృష్ణ కనిపించారు. ఆయన లుక్ మంచి మార్కులు కొట్టేసింది. హరహర మహాదేవ అంటూ దుర్మార్గులపై ఆయన విరుచుకుపడిన తీరుకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

24 గంటలు పూర్తి కాకుండానే 6 మిలియన్లకి పైగా వ్యూస్ ను సాధించి నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. సినిమాఫై అంచనాలు పెంచే దిశగానే ఈ టీజర్ దూసుకుపోతోంది. ఈ టీజర్ చూసినవాళ్లు, బాలకృష్ణ - బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని చెప్పుకుంటున్నారు.