దేశంలో కొత్త‌గా 1.84 ల‌క్ష‌ల మందికి క‌రోనా... 1,027 మంది మృతి

14-04-2021 Wed 10:15
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825
  • మృతుల సంఖ్య 1,72,085
  • కోలుకున్న వారు 1,23,36,036  మంది
  • మొత్తం 26,06,18,866 కరోనా పరీక్షలు  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ మామూలుగా లేదు. నిన్న కొత్త‌గా 1,84,372 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 82,339 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 1,027 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,72,085 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,23,36,036 మంది కోలుకున్నారు. 13,65,704 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 11,11,79,578 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,06,18,866 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,11,758 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.