లక్షణాలు తీవ్రంగా లేకున్నా ఆసుపత్రుల్లో చేరుతున్నారంటూ నటులు, క్రికెటర్లపై ‘మహా’ మంత్రి ఫైర్

14-04-2021 Wed 09:41
  • వైరస్ సోకినా ఆరోగ్యంగా ఉంటే ఇళ్లలోనే ఉండాలి
  • బెడ్లు దొరక్క పోవడానికి వారే కారణం
  • అక్షయ్ కుమార్, సచిన్‌లపై మండిపాటు
Maharashtra Minister fires on Bollywood Celebrities and Cricketers

బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లపై మహారాష్ట్ర మంత్రి షేక్ అస్లాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రులలో బెడ్లు దొరక్కపోవడానికి కారణం వారేనని విమర్శించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి తీవ్రమైన లక్షణాలు లేనప్పటికీ బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు ఆసుపత్రులలో చేరుతున్నారని, బెడ్ల కొరతకు వారే కారణమని అన్నారు. వైరస్ సోకినప్పటికీ ఆరోగ్యంగా ఉంటే ఇళ్లలోనే ఉండాలని మంత్రి సూచించారు. అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ వంటివారు అవసరం లేకున్నా ఆసుపత్రుల్లో చేరారని, ఇది సరికాదంటూ అసహనం వ్యక్తం చేశారు.