EverGien: 'ఎవర్ గివెన్' నౌకకు రూ.7500 కోట్ల రూపాయల జరిమానా!

  • గత నెల 23న సూయజ్ కెనాల్‌లో చిక్కుకుపోయిన నౌక
  • నిలిచిపోయిన వందలాది నౌకలు
  • జరిమానా చెల్లించేందుకు నిరాకరణ
  • జప్తు చేసిన ఈజిప్టు ప్రభుత్వం
Egypt impounds evergiven ship over Rs 7500 crore

గత నెల 23న ప్రమాదవశాత్తు సూయజ్ కాలువలో ఇరుక్కుపోయి వందలాది నౌకలు నిలిచిపోవడానికి కారణమైన రవాణా నౌక ‘ఎవర్ గివెన్’కు ఈజిప్టు న్యాయస్థానం ఏకంగా రూ. 7500 కోట్ల (100 కోట్ల డాలర్లు) జరిమానా విధించింది. నౌక నిలిచిపోవడం కారణంగా నౌకా వాణిజ్యానికి భారీ నష్టం కలిగిందన్న కారణంతో ఈ జరిమానా విధించింది.

నౌకను అక్కడి నుంచి కదిలించి నౌకా రవాణాకు మార్గం సుగమం చేయడానికి అయిన ఖర్చు, నౌక నిలిచిపోవడం కారణంగా వాణిజ్యానికి జరిగిన నష్టం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ జరిమానా విధించింది. అయితే, ఈ జరిమానాను చెల్లించేందుకు నౌక యాజమాన్యం నిరాకరించడంతో ఈజిప్టు ప్రభుత్వం నౌకను జప్తు చేసింది. జరిమానాను చెల్లించే వరకు నౌకను తమ జలాల నుంచి కదలనివ్వబోమని స్పష్టం చేసింది.

More Telugu News