సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

14-04-2021 Wed 07:40
  • ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ భామ 
  • రవితేజ బ్యానర్లో మలయాళ హీరో
  • ద్విపాత్రాభినయం చేయనున్న గోపీచంద్  
Kiara Advani opposite NTR

*  'జనతా గ్యారేజ్' చిత్రం తర్వాత మళ్లీ ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్టు ఇటీవలే కొరటాల ప్రకటించాడు. ఇక ఇందులో కథానాయిక పాత్రకు బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా వున్న హీరో రవితేజ త్వరలో చిత్ర నిర్మాణంలోకి దిగనున్నాడు. ఇందుకోసం 'ఆర్టీ వర్క్స్' అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. తొలి ప్రయత్నంగా ఓ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ మలయాళ హీరో నటిస్తాడని తెలుస్తోంది.
*  గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో 'అలిమేలుమంగ వెంకటరమణ' చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ఇందులో గోపీచంద్ కవలలుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటించే అవకాశం వుంది.