గంగవరం పోర్టు ఇక అదానీకే.. 89.6 శాతం వాటాకు సీసీఐ ఆమోదం

14-04-2021 Wed 07:38
  • పూర్తిగా అదానీ సొంతం కానున్న గంగవరం పోర్టు
  • ఏపీ ప్రభుత్వానికి మిగిలింది 10.4 శాతం వాటానే
  • ఇకపై పోర్టులోని కార్యకలాపాలన్నీ నిర్వహించేది అదానీయే
Gangavaram port now going in to Adani Hands

గంగవరం పోర్టు ఇక పూర్తిగా అదానీ చేతిలోకి వెళ్లిపోనుంది. పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) తీసుకున్న 89.6 శాతం వాటాకు కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బీవోటీ విధానంలో 30 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుని గంగవరంలో పోర్టును అభివృద్ధి చేసిన డీవీఎస్ రాజు గ్రూప్ పెద్దమొత్తంలోని తన వాటాను ఇటీవల అదానీకి విక్రయించింది. ఈ పోర్టులో ఏపీ ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఉంది. మిగిలిన 89.6 శాతం వాటా తీసుకునేందుకు ఇప్పుడు సీసీఐ నుంచి అదానీకి అనుమతి రావడంతో పోర్టు పూర్తిగా అదానీ చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఇక నుంచి ఇక్కడ కార్యకలాపాలన్నీ అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.