హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. రాత్రి నుంచి వర్షం

14-04-2021 Wed 06:30
  • ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం
  • ఇంకా కురుస్తూనే ఉన్న వర్షం
  • అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు
Light Rain fall in many areas in Hyderabad

గత రెండు రోజులుగా కాస్తంత చల్లగా ఉన్న హైదరాబాద్ వాతావరణం గత రాత్రి ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత నెమ్మదిగా మొదలైన వర్షం రాత్రి నుంచి కురుస్తూనే ఉంది.

మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, బోరబండ, రహమత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.