ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ ముంబయి... టాస్ గెలిచిన కోల్ కతా

13-04-2021 Tue 19:15
  • చెన్నై వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న కోల్ కతా
  • ముంబయి జట్టులో ఒక మార్పు
  • క్రిస్ లిన్ స్థానంలో డికాక్
KKR won the toss against Mumbai Indians

ఐపీఎల్ లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. టోర్నీలో బలమైన జట్లుగా గుర్తింపు పొందిన ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్ కు కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టును ఓడించిన కోల్ కతా నేటి మ్యాచ్ లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. ఇక, ముంబయి జట్టులో క్రిస్ లిన్ స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చాడు. రెండు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి.