నవ్వుతూ, నవ్వులు పూయిస్తూ... బీజేపీలో చేరిన సందర్భంగా నటి హేమ ప్రసంగం

13-04-2021 Tue 18:18
  • నిన్న బీజేపీలో చేరిన టాలీవుడ్ నటి హేమ
  • జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరిక
  • ప్రసంగం ఆద్యంతం నవ్వులే నవ్వులు!
  • రత్నప్రభ పేరు పూర్తిగా పలకలేకపోయిన వైనం
Hilarious speech of actress Hema at Nellore BJP rally

టాలీవుడ్ నటి హేమ బీజేపీలో చేరడం తెలిసిందే. నిన్న నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో హేమ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగం ఆద్యంతం నవ్వులు పూయించింది. తాను నవ్వుతూ, తన మాటలతో నవ్విస్తూ... హేమ రాజకీయ ప్రసంగం కాస్తా కామెడీ ప్రసంగంలా మారింది. తిరుపతి లోక్ సభ అభ్యర్థి పేరును కూడా ఆమె పూర్తిగా పలకలేకపోయారు. పైగా రాజకీయ సభలో వకీల్ సాబ్ చిత్రం గురించి ప్రస్తావిస్తూ, పవన్ కల్యాణ్ ను ఓ రేంజిలో పొగిడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.